Site icon Prime9

Jnanpith Award : ప్రముఖ రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు

Jnanpith Award

Jnanpith Award : హిందీ భాషలో అనేక రచనలు చేసిన ప్రముఖ రచయిత వినోద్‌ కుమార్‌ శుక్లాకు దేశంలోనే ఉన్నత సాహిత్య గౌరవమైన జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు దక్కింది. ఛత్తీస్‌గఢ్‌‌కు చెందిన 88 ఏళ్ల శుక్లా ఎన్నో రచనలు చేశారు. హిందీలో షార్ట్‌ స్టోరీస్‌, కవితలు, వ్యాసాలు రాశారు. దేశంలోని ప్రముఖ హిందీ రచయితల్లో ఒకరైన శుక్లా సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఉన్నత పురస్కారం దక్కింది.

 

 

శుక్లాను జ్ఞాన్‌పీఠ్‌ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. వినోద్ కుమార్ శుక్లా 59వ జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం అందుకోబోతున్నారు. ఇప్పటికే ఈ అవార్డును 58 మంది అందుకున్నారు. జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారం అందుకున్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర తొలి రచయితగా శుక్లా గుర్తింపు పొందారు. హిందీ భాషలో అవార్డు అందుకున్న 12వ రచయితగా నిలిచారు.

 

 

ప్రఖ్యాత స్టోరీ టెల్లర్‌, జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞాన్‌పీఠ్‌ సెలెక్షన్‌ కమిటీ సమావేశంలో శుక్లాను అవార్డుకు ఎంపిక చేశారు. జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారంతోపాటు రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. శుక్లా 1999లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.

Exit mobile version
Skip to toolbar