Site icon Prime9

New Rules: బిగ్ అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్

New rules from April 1st: మార్చి నెల ముగిసింది. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ మేరకు ఆర్థిక వ్యవహారాల్లో పలు కీలక మార్పులు వచ్చాయి. ఇంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఇన్‌కమ్ టాక్స్ మార్పులు, కొత్త శ్లాబులు నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే రూ.12 లక్షల వరకు ప్రీ టాక్స్, టీడీఎస్, టీసీఎస్ మార్పులు, క్రెడిట్ కార్డు నిబంధనలు, యూపీఐ సేవలు, మినిమిం బ్యాలెన్స్, గ్యాస్ ధరల్లో మార్పులు వంటి నిబంధనలు మారనున్నాయి.

 

2025 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంద్రి నిర్మలా సీతారామన్ పలు రకాలు మార్పులు ప్రకటించారు. ప్రధానంగా కొత్త పన్ను స్లాబ్, రేటు మార్పులు ప్రకటించింది. ఇందులో భాగంగానే రూ.12లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలిపితే మొత్తం రూ.12.75 లక్షల వరకు వేతనం ఉన్న వారికి ఊరట కలిగింది.

 

యూపీఐ విషయంలో ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా పనిచేయని బ్యాంకుల యూపీఐ సేవల్లో లావాదేవీలను నేటి నుంచి నిలిపివేయనుంది.ఇప్పటికే బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు ఎన్‌పీసీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.ఇందులో భాగంగానే డియాక్టివేట్ నంబర్లను దశలవారీగా తొలగిస్తూ వస్తుంది.

 

క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్ తగలనుంది. నేటి నుంచి క్రెడిట్ కార్డు అందించే బ్యాంకులలో ఆయా రివార్డు పాయింట్లలో కోత విధించాయి. ఎస్‌బీఐ సింప్లిక్లిక్, ఎయిర్ ఇండియా ఎస్‌బీఐ ప్లాటినం కార్డు రివార్డు పాయింట్లలోనూ కోత విధించింది. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్ బుకింగ్ విషయంలో లభించే రివార్డులలో కోత విధించింది. ఈ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా, ఏకీకకృత పెన్షన్, జీఎస్టీ రూల్స్, బ్యాంకుల్లో మినిమి బ్యాలెన్స్, గ్యాస్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

Exit mobile version
Skip to toolbar