Site icon Prime9

Maharashtra: మహారాష్ట్రలో సీఎం పోస్ట్ కోసం పోటాపోటీ .. సీఎం రేసులో కొత్త పేర్లు

New Name Emerges As Maharashtra CM: మహారాష్ట్ర సీఎం విషయంలో మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్‌ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.

ఈ నెల 2న శాసనసభా పక్ష నేత ఎన్నిక..
శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ఈ నెల 2వ తేదీన సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత 5న ముంబయిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి. మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన అపధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబయి చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతాను’అని చెప్పారు.

సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవిస్‌..
288 అసెంబ్లీ సీట్లలో 230 కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 132 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. కొత్త సీఎం ఎవరనే అంశంపై మహాయుతిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమవుతోంది. సీఎం అభ్యర్థి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్‌, మురళీధర్‌, వినోద్ తావ్డే, రాధాకృష్ణ విఖే-పాటిల్ వంటి ప్రత్యామ్నాయ పేర్లను అగ్రనాయకత్వం పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం పదవితోపాటు హోంశాఖ కోసం పట్టుబట్టినట్టి తెలిసింది. అయితే ఇందుకు బీజేపీ అధిష్ఠానం ఒప్పుకోకపోవడంతో పీఠముడి పడ్డట్టు తెలుస్తోంది.

ప్రధాని మోడీ, అమిత్‌ షాలదే తుది నిర్ణయం : ఏక్‌నాథ్‌ శిండే
సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీ , అమిత్‌ షాలదే తుది నిర్ణయమని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే తెలిపారు. వారి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్నారు. దీంతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు బీజేపీకే దక్కుతాయని, దేవేంద్ర ఫడ్నవీస్‌ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు డిప్యూటీ సీఎంలు, కేబినెట్‌ బెర్తులపై స్పష్టత రానున్నది.

ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరు!
మహారాష్ట్ర మహాయుతి కూటమిలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు? మంత్రుల స్థానాలపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో, ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ సీఎం అభ్యర్థిగా తెరపైకి కొత్త పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మురళీధర్‌ మోహోల్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదన చేసినట్టు సమాచారం. మరోవైపు మహాయుతి కూటమిలో శివనసే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, 24 గంటల్లో షిండే కీలక ప్రకచేస్తారనే చర్చ మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో షిండే అనారోగ్యంతో ఉన్నారని మరికొందరు నేతలు చెబుతున్నారు. కాగా, షిండే మాత్రం ఆయన స్వగ్రామం సతారాకు వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, షిండే ఎలాంటి ప్రకటన చేస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

అంతా ఉత్తదే : కేంద్ర మంత్రి మురళీధర్‌ మోహోల్‌
ఈ విషయంపై ఎంపీ స్పందిస్తూ అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. సీఎం రేసులో తన పేరు ఉందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా కల్పితమని పేర్కొన్నారు. సీఎం ఎవరనే విషయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు తేలుస్తుందని, సోషల్‌ మీడియా కాదని వివరణ ఇచ్చారు. తమ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పోరాడి, అద్భుత విజయం సాధించిందని మురళీధర్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని అన్నారు.

షిండేకు భారీ షాక్ ? శివసేన నేత కీలక వ్యాఖ్యలు..
మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదన ఇలా ఉండవచ్చని తెలుస్తోంది. బీజేపీ-132+ షిండే సేన-57+ అజిత్‌ పవార్‌-41+ ఇతరులు= 235. ప్రభుత్వం ఏర్పాటైతే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పదవి, కూటమి నుంచి ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులు అనే ప్రతిపాదన ఇప్పటి వరకు వినిపిస్తోంది. ఇక​, కూటమి ప్రభుత్వం షిండే హోం మంత్రి పదవి అడిగారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇందుకు బీజేపీ ఒప్పకోలేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version