Site icon Prime9

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో మరో మలుపు.. హజారీబాగ్ లో ప్రశ్నాపత్రం ట్యాంపరింగ్ ?

NEET Paper Leak

NEET Paper Leak

NEET Paper Leak:నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. జార్ఖండ్‌ హజారీబాగ్‌లోని ఒయాసిస్ పాఠశాలలో ప్రశ్నపత్రం షీల్డ్ ప్యాకెట్ దిగువ భాగంలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఈఓడబ్ల్యూ బృందం గుర్తించింది.ప్రశ్నపత్రం ప్యాకెట్‌లోని దిగువ భాగాన్ని చాలా జాగ్రత్తగా తారుమారు చేసి, అతికించినట్లు ఈఓయూ బృందం తన విచారణలో కనుగొంది.

డిజిటల్ లాక్ పనిచేయలేదు..(NEET Paper Leak)

దీనిపై పాఠశాల ప్రిన్సిపాల్ ఎహసాన్ ఉల్ హక్ మాట్లాడుతూ.. ఈ విషయం అప్పట్లో తమ దృష్టికి రాలేదన్నారు. పరీక్షకు 15 నిమిషాల ముందు ప్యాకెట్ తెరవబడిందన్నారు.ప్రశ్నపత్రాన్ని కొరియర్ కంపెనీ బ్యాంకుకు చేరవేసేందుకు అనుసరించిన పద్ధతి, రవాణా చేసే విధానంలో కూడా పెద్ద లోపాలున్నాయని ఈఓయూ బృందం కనుగొంది. ఎస్‌బిఐ బ్యాంకులో విచారణలో ఇఒయు అనేక లోపాలను కూడా గుర్తించింది. ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ మరో విషయాన్ని వెల్లడించారు. పరీక్షకు ముందు ప్రశ్నపత్రం తీయడానికి తెరవాల్సిన పెట్టె డిజిటల్ తాళం ఆ రోజు పనిచేయలేదని చెప్పాడు. నిజానికి అందులో రెండు తాళాలు ఉన్నాయి. 1.15 నిమిషాలకు బీప్ సౌండ్ వినిపించగానే బాక్స్ ఓపెన్ అవుతుంది. కానీ ఆ రోజు అలాంటి శబ్దం వినిపించలేదు. పరిశీలకుడు ఎన్టీఏకు సమాచారం ఇచ్చాడు. సాంకేతిక సమస్య వల్ల సౌండ్ రాలేదని తెలుస్తోందని ఎన్టీఏ తెలిపింది. తర్వాత కట్టర్‌తో కట్‌ చేయమన్నారు.

సీబీఐ దర్యాప్తు..

విద్యా మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు, నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో సీబీఐ ఐపీసీ సెక్షన్లు 420 (చీటింగ్), 406 (నమ్మక ఉల్లంఘన), 120బి (నేరపూరిత కుట్ర) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ ఈ కొత్త కేసు నమోదు చేసింది. వారి కేసు దర్యాప్తు నివేదికను కూడా సీబీఐ బీహార్ పోలీసులను కోరనుంది. సిబిఐకి చెందిన ఒక బృందం పాట్నాకు చేరుకోగా, ఒక బృందం గుజరాత్‌లోని గోద్రాకు చేరుకుంది మరియు త్వరలో కేసు దర్యాప్తు అధికారిని కలుసుకుని కేసు వివరాలను తీసుకుంటుంది.

Exit mobile version