Site icon Prime9

Robert Vadra: ముస్లింలు ఇబ్బంది పడుతున్నారనే పహల్గాం దాడులు జరిగాయి : వాద్రా సంచలన వ్యాఖ్యలు

 

  • దుమారం రేపుతున్న రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు
  • ముస్లింలు ఇబ్బంది పడుతున్నారనే పహల్గాం దాడులు జరిగాయన్నారు
  • పహల్గామ్ దాడి ప్రధాని మోదీకి సందేశం అని వాద్రా అభివర్ణించారు

Pahalgam Terror Attack: దేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నందునే  పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారన్నారు రాబర్ట్ వాద్రా. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన భారత దేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారని చెప్పారు. బిజేపీ హిందుత్వను ప్రోత్సహిస్తున్నందునే దాడి జరిగిందన్నారు. ఉగ్రవాదులు హిందువులను వెతికిమరీ షూట్ చేశారన్నారు. హిందూ టూరిస్టులపై దాడి చేసి ప్రధాని మోదీకి తీవ్రవాదులు సందేశాన్ని పంపారన్నారు. హిందువులను విడిగా నిలబెట్టి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి కాల్చడం అందుకు ఉదాహరణ అని అన్నారు.

 

భారత్ లో మోదీ ప్రభుత్వం హిందుత్వ గురించి మాత్రమే మాట్లాడుతుందన్నారు వాద్రా.  మైనారిటీలకు అలాంటి చర్యలకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉన్నట్లు చెప్పారు. హిందువులు, ముస్లింల మధ్య విభజన ఏర్పడిందని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనాన్ని రేపాయి. ఉగ్రవాదులు, టూరిస్టుల గుంపులోని హిందువులను మాత్రమే టార్గెట్ చేయడం మోదీకి సందేశం పంపడమేనని నొక్కి వక్కానించారు.

 

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఐటి సెల్ ఇంచార్జ్ అమిత్ మాల్వియా రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “షాకింగ్! సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఉగ్రవాద చర్యను సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారు, ఉగ్రదాడులను ఖండించాల్సిందిపోయి వారిని వెనకేసుకొస్తున్నారు. ఆయన అక్కడితో ఆగకుండా, పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దురాగతాలకు భారత్ పై నింద మోపుతున్నారు.” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar