Site icon Prime9

Prime Minister Modi: ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. ముంబై ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్

Mumbai Police Traces Threat Message Against PM Modi To Ajmer: ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన అభియోగాలతో ఓ వ్యక్తిపై కేసు నమోదు కావడం సంచలం రేపింది. ప్రధాని హత్యకు కుట్ర చేసినట్లుగా శనివారం ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్‌తో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు. బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్ వాసిగా తేల్చారు. అతడికి మతి భ్రమించిందని గుర్తించారు. పోలీసులు మాత్రం బెదిరింపు మెసేజ్ ల నేపథ్యంలో అతడిపై భారత న్యాయసంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గతంలో బెదిరింపు కాల్స్..
ప్రధాని హత్యకు కుట్ర పన్నినట్లుగా గతంలో కూడా ఫేక్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత నవంబర్ లో మోదీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. ప్రధానిని హతమార్చేందుకు ప్లాన్ సిద్ధంగా ఉందని, ఆయుధాలు కూడా రెడీగా ఉన్నాయని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించారు. అందులో మోదీని కాల్చివేస్తానని బెదిరించాడు. వీడియోలో యువకుడు తాను హర్యానాకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నాడు. సోనిపట్‌లోని మోహనా గ్రామ నివాసిగా తెలిపాడు.

2022లో..
2022లో కూడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జేవియర్ అనే వ్యక్తి కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌కు పంపిన లేఖలో మోదీని చంపేస్తానని రాశాడు. మోదీ పరిస్థితి రాజీవ్ గాంధీలా ఉంటుందని బెదిరించాడు. తరుచు మోదీని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ప్రధాని భద్రతపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మరింత ఫోకస్ పెట్టింది.

Exit mobile version