Mulayam Singh Yadav: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు, రాజకీయ కురువృద్దుడు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధతి విషమంగా ఏర్పడింది. ఐసీయులో చికిత్స తీసుకొంటున్న ములాయం సింగ్ యాదవ్ పరిస్ధతి మరింత క్షీణించిన్నట్లు జాతీయ మీడియా కధనాలతో తెలుస్తుంది.
గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడిన ఆయన్ను గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ నందు చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్ధతి ఆందోళనకరంగా ఉందని వార్తలు ఊపందుకొన్నాయి. ప్రముఖ వైద్యులు డాక్టర్ సుషీలా కటారియా ములాయం సింగ్ ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తండ్రి పరిస్ధితి విషమంగా ఉందన్న సమాచారం అందుకొన్న కొడుకు అఖిలేష్ యాదవ్ హుటాహుటిన గురుగ్రామ్ కు బయల్దేరి వెళ్లిన్నట్లు సమాచారం.
ములాయం సింగ్ యాదవ్ వయసు 82 సంవత్సరాలు కాగ, మూడు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశ రక్షణ శాఖా మంత్రిగా కూడా సేవలందించారు. గతంలో కరోనా బారిన పడటంతో ములాయం సింగ్‌ను అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టాయి. అనారోగ్యం కారణంగా క్రియాశీల రాజకీయాలకు కొంత కాలంగా ములాయం దూరంగానే ఉన్నారు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవే అన్నీ తానై పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి:UNESCO: కృషి, నైపుణ్యంతోనే గొల్లభామ చీరలకు యునెస్కో గుర్తింపు…మంత్రి హరీష్ రావు