Site icon Prime9

Mohan Yadav: పాట పాడిన సీఎం.. మంత్రులు చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్

Ministers Dance to The CM Mohan Yadav song Video Viral: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాట పాడారు. ఈ పాటకు రాష్ట్ర మంత్రులు డ్యాన్స్‌లు చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లో హోలీని పురస్కరించుకొని ఫాగ్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇందులో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాడిన పాటకు అక్కడ ఉన్న మంత్రులు సీఎం పాటకు తగిన విధంగా డ్యాన్స్ చేశారు.

 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని విధాన సభ హాల్‌లో హోలీని పురస్కరించుకొని ఫాగ్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం మోహన్ యాదవ్‌తో పాటు స్పీకర్ నరేంద్ర సింగ్, డిప్యూటీ సీఎంలు జగదీశ్ దేవదా, రాజేంద్రకుమార్ శుక్లా, మంత్రి కైలాశ్ విజయవర్గీయ్, తదితర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. ఇలాంటి పండుగలతో ప్రజల మధ్య రిలేషన్ షిప్ పెరగడంతో పాటు ప్రేమాభిమానులు ఉంటాయని సీఎం అన్నారు. అనంతరం సీఎం హోలీ పాటలు పాడారు. ఈ పాటలతో అందరిలో ఉత్సాహం రెట్టింపు అయింది.

Exit mobile version
Skip to toolbar