Site icon Prime9

కౌశల్ కిషోర్: మద్యం తాగే వారికి మీ పిల్లల్ని ఇచ్చి పెళ్లిచేయకండి- కేంద్రమంత్రి కౌశల్ కిషోర్

KISHORE

KISHORE

Minister Kaushal Kishore: మద్యం సేవించే అధికారి కంటే రిక్షా పుల్లర్ లేదా కూలీ మంచి పెళ్లికొడుకులని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ అన్నారు. తమ కుమార్తెలు మరియు సోదరీమణులను మద్యపానం చేసేవారికిచ్చి పెళ్లి చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆయన లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో డి-అడిక్షన్‌పై ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, “మద్యపానం చేసేవారి జీవితకాలం చాలా తక్కువ” అని అన్నారు.

దీనిపై తన వ్యక్తిగత అనుభవాన్ని మంత్రి వివరించారు. నేను ఎంపీగా, నా భార్య ఎమ్మెల్యేగా మా కుమారుడి ప్రాణాలను కాపాడలేనప్పుడు.. సామాన్య ప్రజానీకం ఎలా చేస్తారని అన్నారు. నా కొడుకు (ఆకాష్ కిషోర్) తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడని.. డీ అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించాము.. ఆ చెడు అలవాటు మానేస్తానని ఆరు నెలలకే పెళ్లి చేసుకున్నాడు.. అయినా మళ్లీ తాగడం మొదలుపెట్టాడు. అది చివరికి అతని మరణానికి దారితీసింది. రెండేళ్ల క్రితం, అక్టోబర్ 19న, ఆకాష్ మరణించినప్పుడు, అతని కుమారుడికి కేవలం రెండు సంవత్సరాల వయస్సు అని మంత్రి కిషోర్ చెప్పారు. నేను నా కొడుకును రక్షించలేకపోయాను, దాని కారణంగా అతని భార్య వితంతువు అయ్యింది, మీరు మీ కుమార్తెలు మరియు సోదరీమణులను దీని నుండి రక్షించాలి” అని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, 90 సంవత్సరాల వ్యవధిలో 6.32 లక్షల మంది బ్రిటిష్ వారితో పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేశారని, వ్యసనం కారణంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది మరణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా 80 శాతం క్యాన్సర్ మరణాలు పొగాకు, సిగరెట్లు మరియు ‘బీడీ’ల వల్లే జరుగుతున్నాయని తెలిపారు.

డి-అడిక్షన్ కార్యక్రమంలో ప్రేక్షకులు మరియు ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని, వారి కుటుంబాలను రక్షించాలని ఆయన కోరారు.జిల్లాను వ్యసనా రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్‌ను అన్ని పాఠశాలలకు తీసుకెళ్లాలని, ఉదయం ప్రార్థన సమయంలోనే పిల్లలకు దీనిపై సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు.

Exit mobile version