Meghalaya: మేఘాలయ ప్రభుత్వం తాజాగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు విషయాన్ని మేఘాలయ ట్యాక్సేషన్ మంత్రి జేమ్స్ పీకే సంగ్మా ప్రకటించారు. ప్రస్తుతం పెట్రోల్ పై పన్నును లీటరుకు రూ.12.50కు లేదా 13.5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా డీజిల్‌పై కూడా పన్నును లీటరుకు రూ.5.50కు లేదా 5 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. అంతకుముందు లీటరు డీజిల్‌పై పన్నులు కేవలం లీటరుపై రూ.4గా లేదా 5 శాతంగా మాత్రమే ఉండేవి.
‘అస్సాంలో పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచినట్టు మీకు తెలిసే ఉంటుంది. దీనికి అనుగుణంగా పెరిగిన ధరల నుంచి ప్రయోజనం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలను ప్రవేశపెట్టింది. పెంచిన రేట్ల పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మేఘాలయ ట్యాక్సేషన్ మంత్రి జేమ్స్ పీకే సంగ్మా మీడియా ముందు తెలిపారు.
మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను అసలు తగ్గించడం లేదు. దేశవ్యాప్తంగా చివరిసారి మే 21న మాత్రమే ధరలను తగ్గించింది. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలుకు న, ఫారిన్ ఎక్స్చేంజ్ ధరలకు అనుగుణంగా ప్రతి రోజూ ఇంధనం రేట్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లు పెట్రోల్, డీజిల్ రేట్లను నిర్ణయిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినా, పెంచినా ఉదయం ఆరు గంటలకే మారిపోతాయి.