Site icon Prime9

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి

Massive Encounter in Chhattisgarh 20 Maoists Killed: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో దండకారణ్యం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.

అయితే సుక్మా జిల్లాకు సమీపంలోని గోగుండా కొండ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరు వర్గాలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు పోలీసులు కాల్పులు జరిపి 20 మంది మావోయిస్టులను హతమార్చారు.

 

కాగా, ఈ ఎదురుకాల్పులు కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇందులో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం దండకారణ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar