Site icon Prime9

Manipur: మణిపూర్‌లో మరోసారి హింస.. 11మంది కుకీ మిలిటెంట్లు మృతి

Manipur attacking Army camp: మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఈ క్రమంలో జిరిబామ్‌ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11మంది సాయుధులు మృతిచెందారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌పై దాడులకు తెగబడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా కుకీ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌) జవాన్లు కొందరు గాయపడ్డారు. జకురాడోర్ కరోంగ్‌లోని ఇళ్లకు నిప్పు పెట్టారు. అక్కడకు చేరుకున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు.

ఎదురు కాల్పులు..
భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో 11మంది కుకీ మిలిటెంట్లు మృతిచెందారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌కు చెందిన కొందరు జవాన్లు కూడా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న నిరాశ్రయుల శిబిరం కుకీ మిలిటెంట్ల లక్ష్యం కావచ్చని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేశాయి. జీర్‌బామ్ జిల్లాలోని ఈ పోలీస్ స్టేషన్‌ను కుకీ మిలిటెంట్లు పలుసార్లు టార్గెట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Exit mobile version