Site icon Prime9

Raipur: వైరల్ వీడియో.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి

Raipur

Raipur

Raipur: మేనకోడలి పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తు.. ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాజనందన్ గావ్ లో జరిగింది.

కుప్పకూలిన వ్యక్తి.. (Raipur)

మేనకోడలి పెళ్లిలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తు.. ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాజనందన్ గావ్ లో జరిగింది.

ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు అందరిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా ఓ వ్యక్తి.. తన మేనకోడలికి పెళ్లి అయిందనే పట్టరాని సంతోషంతో స్టేజీపైనే డ్యాన్స్ చేశాడు.

ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో.. పెళ్లి వేదికపైనే కుర్చుండిపోయి మృత్యు ఒడికి చేరుకున్నాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.

ఈ విషాదం.. ఛత్తీస్ గఢ్ లోని రాజనందన్ గావ్ లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి పేరు దిలీప్ రాజ్ కుమార్ అని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉన్నట్లుండి గుండెపోటుతో మరణించడంతో.. కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన బంధువులు విషాదంలోకి వెళ్లిపోయారు.

ఉత్సాహాంగా పెళ్లి వేదికపై డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను అక్కడున్నవారు.. తమ సెల్ ఫోన్లో బంధించారు.

ఇదే సమయంలో.. ఆయన గుండెపోటుతో కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా.. ఈ మధ్య గుండెపోటు ఘటనలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే.

వయసుతో సంబధం లేకుండా, యువకులు, పెద్ద వయస్కులు అనే తేడా లేకుండా చాలా మంది హఠాత్తుగా హార్ట్‌ఎటాక్‌తో కుప్పకూలుతున్నారు.

జిమ్‌లో వ్యాయామం చేస్తూ, గేమ్స్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కల్గిస్తోంది.
చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు

Exit mobile version