Makara Jyothi Darshanam: ‘స్వామియే శరణం అయ్యప్ప’అంటూ అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగిపోయాయి.
అయ్యప్ప భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు హరిహరక్షేత్రనాకి తరలివచ్చారు.
పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం కాగానే అయ్యప్ప స్వాములు పులకించిపోయారు.
ప్రతి ఏటా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈశాన్య దిశలో పర్యత శ్రేణుల నుంచి జ్యోతి(Makara Jyothi Darshanam) రూపంలో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం.
కాంతమాల కొండలపై దేవతలు , రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల విశ్వాసం.
తిరువాభరణాలతో పందళ రాజవంశీయులు సన్నిధానం చేరుకుని.. బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరిస్తారు. అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది.
భారీ ఏర్పాట్లు చేసిన ట్రావెన్ కోర్
ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం , టోల్ ప్లాజా, హిల్ టాప్ వద్ద జ్యోతి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
ప్రతి యేడు మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. అయితే స్థానిక ప్రజలు దీనినే మకరవిళక్కు వార్షిక పండుగ అని అంటారు. ఈ వార్షిక ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.
అయ్యప్ప భక్తులు మండలకాలం దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని శబరిమల చేరుకున్నారు. పంబాన నదిలో స్నానం తర్వాత రాళ్లదారిలో అడవి మార్గంలో నడిచి సన్నిధానాన్ని చేరుకున్న స్వాములు మకర జ్యోతిని దర్శించుకుని పులకించిపోయారు.
మకరజ్యోతి అనేది శబరిమల ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అరణ్య ప్రాంతమైన పొన్నంబలమేడు కొండపై కనిపించే ద్వీపం.
ఇది ఆ కొండపై మూడుసార్లు కనిపిస్తుంది. శబరిమల వెళ్లే భక్తులు మకరజ్యోతి దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య ఫలమొస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇక ప్రతి ఏడా జ్యోతి దర్శనానికి వేలాది మంది భక్తులు శబరిమలకు వస్తుంటారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/