Prime9

Mahua Moitra : బీజేడీ మాజీ ఎంపీని రహస్యంగా పెళ్లాడిన టీఎంసీ ఎంపీ.. ఫొటో వైరల్

Trinamool Congress MP Mahua Moitra : పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా విదేశాల్లో రహస్యంగా వివాహమాడింది. ఒడిశాకు చెందిన బీజు జనతాదళ్ సీనియర్ నేత, పూరీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను మే 3వ తేదీన జర్మనీలో ఆమె పెళ్లి చేసుకున్నట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. సాంప్రదాయ దుస్తులు ధరించి, బంగారు ఆభరణాలతో అందంగా ముస్తాబైన మహువా మొయిత్రా, మిశ్రా చేయి పట్టుకున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మహువాతోపాటు టీఎంసీ పార్టీ ఆమె వివాహం గురించి అధికారికంగా ప్రకటించలేదు.

 

అస్సాంలో మహువా మొయిత్రా జన్మించారు. ఆమె పెట్టుబడి బ్యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2010లో మమతా బెనర్జీ పార్టీలో చేరింది. 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికైంది. 2024లో మరోసారి విజయం సాధించింది. టీఎంసీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరుగాంచిన మహువా మొయిత్రా పార్లమెంట్‌ ప్రసంగాలతో జాతీయంగా ప్రాముఖ్యత పొందింది.

 

మరోవైపు మహువా మొయిత్రా మొదట డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రూర్సెన్‌ను వివాహం చేసుకున్నది. కొంతకాలం తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌తో మూడేళ్లపాటు ఆమె రిలేషన్‌లో ఉన్నది. మోసం చేసే మాజీ ప్రేమికుడని ఆమె ఆరోపించింది.

Exit mobile version
Skip to toolbar