Maharashtra Minister Dhananjay Munde resigns: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఓ సర్పంచ్ హత్య జరగగా.. ఆ కేసులో ఆయనపై ఆరోపణలు నెలకొన్నాయి. ఈ నేపథ్ంయలనే మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను నిందితుడిగా చేర్చారు. దీంతో ధనంజయ్‌పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత సీఎం ఆయనను రాజీనామా చేయగాలని కోరగా.. మంత్రి ధనంజయ్ వెంటనే రాజీనామా చేసేందుకు నిర్ణయించుకుని తన పదవికి రిజైన్ చేశారు. ఆయన రాజీనామాను సీఎం దేవేంద్ర పడ్నవీస్ ఆమోదం తెలిపారు. అనంతరం ఆమోద పత్రాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపించినట్లు సీఎం చెప్పారు.
బీడ్‌లోని మసాజోగ్ సర్పంచ్ దేశ్‌ముఖ్‌ను గతేడాది డిసెంబర్ 9 వ తేదీన హత్యకు గురయ్యారు. జిల్లాలో ఓ ఇంధన సంస్థలో నెలకొన్న అక్రమలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయనను అపహరించారు. ఆ తర్వాత ఆయనను వేధింపులకు గురిచేసి హత్య చేసినట్లు వార్తలు వినిపించాయి.
కాగా, ధనంజయ్.. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిగా ఉన్నారు. బీడ్ జిల్లాలోని పర్లి నుండి ఎన్‌సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు బీడ్ సంరక్షక మంత్రిగా కొనసాగారు. అయితే, సర్పంచ్ హత్య విషయంపై ఎన్‌సీపీ చీఫ్, మంత్రి అజిత్ పవార్‌తో పాటు ధనంజయ్ ముండేతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ కేసు విషయాలు బయటపడే వరకు ఆయనను పదవి నుంచి వైదొలగాలని సూచించినట్లు సమాచారం.