Site icon Prime9

Maharashtra Polls: మహా వికాస్ అఘాడీ నేతలు ఔరంగజేబు అభిమానులు.. మహారాష్ట్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీపై బీజేపీ అగ్రనేతలు విమర్శలు పదునెక్కాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మహా వికాస్ అఘాడీపై ఫైర్ అయ్యారు. ఎంవీఏ కూటమి నేతలంతా ఔరంగజేబు అభిమానుల సంఘం నాయకులు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని ధూలేలో బుధవారం జరిగిన బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో షా ప్రసంగించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన తండ్రి బాల్ థాక్రే సిద్ధాంతాలను మరచిపోయారని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే పార్టీలతో ఉద్ధవ్ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు. 10 ఏళ్ల సోనియా-మన్మోహన్ పాలనలో ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛగా వచ్చి ఇక్కడ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు తగ్గించాల్సి ఉంటుందన్నారు.

Exit mobile version