Madhya Pradesh CM Mohan Yadav Announcement for Power Connection: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలో నే ప్రారంభిస్తుందన్నారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతాంగానికి ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలు మెరుగుపడాలని తాము కోరుకుంటున్నామన్నారు. నీటిపారు దల కోసం సోలార్ పైపుల ద్వారా రైతులకు విద్యుత్ సంబంధిత ఇబ్బందుల్నితమ ప్రభు త్వం తొలగిస్తుందన్నారు. రాబోయే మూడే ళ్లలో 30లక్షల సోలార్ ఇరిగేషన్ పంపుల్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతుల నుంచి ప్రభుత్వం
సోలార్ విద్యుత్ను కొనుగోలు చేస్తుందన్నా రు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన మౌలి కవసతులు, విద్యుత్తు, రోడ్లు లేవన్న ఆయన.. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకొచ్చారు. ఈ దశ వ్యవసాయంలో.. విద్యార్థులు, సామాన్య ప్రజలలో సైన్స్ పట్ల ఆసక్తి, ఉత్సుకతను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. రానున్న కాలంలో మధ్యప్రదేశ్ను సైన్స్ రంగంలో ధనిక, సంపన్నరాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణలు, ఇతర సైన్స్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తూనే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఈ అడుగు కేవలం విద్యార్థులకే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజల కోసమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైన్స్ వినియోగాన్ని వివిధ స్థాయిల్లో ప్రోత్సహిస్తోం దన్నారు. శాస్త్రీయ దృక్పథంతో వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ప్రత్యే కంగా నొక్కి చెప్పారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక మెరుగుదలలలో భాగంగా డ్రోన్ టెక్నాలజీ, క్రాప్ సర్వే, ఇతరాలు తద్వారా రైతులు వ్యవసాయంలో ఎక్కువ లాభాలు పొందడంతోపాటు వారి సమస్యలు పరిష్క రించవచ్చని సూచించారు. ఈ దశ వ్యవసా యంలో ఉన్న సవాళ్లకు పరిష్కారాలను అంది స్తుందని, కొత్త సాంకేతికతతో రైతులను కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది.