Site icon Prime9

Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి సక్సెస్

Lalu

Lalu

Lalu Prasad Yadav: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. సింగపూర్ ఆసుపత్రిలో తన తండ్రి లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైందని లాలూ కుమార్తె మిసా భారతి ట్వీట్ చేశారు. లాలూ యాదవ్ రెండవ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీని తండ్రికి దానం చేసింది. సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ, మిసా భారతి ఇలా రాసింది, “పాపా ఆపరేషన్ విజయవంతమైంది. కానీ పాప ఇప్పటికీ ఐసీయూలో ఉన్నారు.అందరితో మాట్లాడుతున్నారు. అందరికీ ధన్యవాదాలు.

ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను పంచుకుంటూ, బీహార్ ఉప ముఖ్యమంత్రి మరియు లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కూడా తన తండ్రి మరియు సోదరి రోహిణి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. పాప కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి మార్చారు. మీ ప్రార్థనలకు, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.

ఆపరేషన్‌కు ముందు లాలూ కూతురు రోహిణి. రాక్ అండ్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. నాకు ఇది చాలు, నీ క్షేమమే నా జీవితం అంటూ ట్వీట్ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం కిడ్నీ పరీక్ష నిమిత్తం సింగపూర్‌ వెళ్లారు. అక్కడి వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. దీనితో ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి తన కిడ్నీ దానం చేయాలని నిర్ణయించుకుంది.

Exit mobile version