Delhi: తాజాగా న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 67 ఏళ్లకు పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానం చేసింది. అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్‌లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. వయో పరిమితి పెంపు తీర్మానానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం 62 సంవత్సరాలుగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు సవరించాలన్నారు. అనుభవజ్ఞులైన న్యాయవాదులను వివిధ కమిషన్లు ఇతర ఫోరమ్‌లకు చైర్మన్‌లుగా నియమించేలా చట్టాలను సవరించేలా పార్లమెంటుకు ప్రతిపాదించాలని తీర్మానం చేసింది. తీర్మానం కాపీని ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.