Site icon Prime9

Kerala fishermen protest: విజింజం ఓడరేవుకు వ్యతిరేకంగా కేరళ మత్స్యకారుల నిరసనలు

Kerala: విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లాటిన్ క్యాథలిక్ చర్చి ప్రతినిధులతో పాటు పలువురు స్థానిక మత్స్యకారులు సోమవారం కేరళలోని తిరువనంతపురంలో నిరసన చేపట్టారు.

మత్స్యకారులు తీర ప్రాంతాలపై శాస్త్రీయ అధ్యయనంతో పాటు వివిధ జీవనోపాధి సమస్యలకు సంబంధించిన డిమాండ్ల యొక్క ఏడు పాయింట్ల చార్టర్‌ను ఉంచారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదని మత్స్యకారులు పేర్కొన్నీరు. ఓడరేవు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టును ప్రారంభించే ముందు శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని లాటిన్ క్యాథలిక్ చర్చి ప్రతినిధులు స్పష్టం చేశారు. తీరప్రాంత ప్రజల జీవితాలపై ఓడరేవు ప్రభావం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

5,000 మంది మత్స్యకారులు తిరువనంతపురం తీరంలో గుమిగూడారు. పలువురు తమ పడవలపై వచ్చి నిరసన తెలిపారు. వీరిని అదుపుచేయడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. విజిజం ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా తీర ప్రాంత మహిళలతో సహా అనేక మంది స్థానిక మత్స్యకారులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఓడరేవును అశాస్త్రీయంగా నిర్మించడం వల్ల జిల్లాలో తీరం కోతకు గురవుతుందని వారు చెబుతున్నారు.

Exit mobile version