Non Bailable Arrest warrant Against Ramdev Baba: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబకు కేరళ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బాబా రాందేవ్ సహచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ పైనా వారెంట్ ఇష్యూ చేసింది. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ మేరకు కేరళ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వారిద్దరిపై కేసు నమోదు చేశారు. గతంలోను విచారణకు హాజరు కాలేదని ఆయనపై జనవరిలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తూ ఫిబ్రవరి 1న విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ సారి కూడా వీరిద్దరు విచారణకు హజరు కాలేదు. శనివారం (ఫిబ్రవరి 1) జరిగిన విచారణకు రాలేదు. దీనికి ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదు. దీంతో వారిపై తీరుపై కేరళ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు పాలక్కాడ్ కోర్టు బాబా రాందేవ్ కు, ఆచార్య బాలకృష్ణకు మరోసారి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అవాస్తవాలను ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కేరళ డ్రగ్ ఇన్ స్పెక్టర్ వారిద్దరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పాలక్కాడ్ కోర్టు బాబా రాందేవ్ కు, ఆచార్య బాలకృష్ణకు గతంలో నోటీసులు పంపించింది.