Prime9

DK Shivakumar Falls from Cycle: సైకిల్ దిగబోయి కింద జారీ పడిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. వీడియో వైరల్!

Karnataka Deputy CM DK Shivakumar Falls Down from Cycle: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సైకిల్‌ దిగబోయి అసెంబ్లీ మెట్లపై పడ్డాడు. సైకిల్ బ్రేక్‌ పట్టుకోవడం మరిచిపోయిన ఆయన.. రన్నింగ్‌ సైకిల్ దిగుతూ మెట్లపైకి వెళ్లి కూలబడ్డాడు. వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా బెంగళూరులో మంగళవారం ఎకో-వాక్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు డీకే శివకుమార్ సైకిల్‌పై అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మెట్ల ముందు సైకిల్ దిగుతూ డీకే సైకిల్‌పై నియంత్రణ కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది ఆయనను పైకి లేపారు. ‘RKTimes’ అనే ఎక్స్‌ హ్యాండిల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌గా కమాల్‌ అంటూ వీడియోను షేర్‌ చేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar