Site icon Prime9

Threat mail : కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంను చంపేస్తాం : సిద్ధరామయ్య, డీకే శిమకుమార్‌కు బెదిరింపులు

Karnataka

Karnataka

Threats to Karnataka CM and Deputy CM : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌లను హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు ఈ మెయిల్‌లో బెదిరింపు సందేశం పంపాడు. తాజాగా కర్ణాటక విధానసౌధ పోలీసులు విషయాన్ని వెల్లడించారు.

రాంపురకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను రూ.కోటి అప్పుగా ఇచ్చానని, అప్పు తిరిగి చెల్లించకపోతడంతో అతడిని హత్య చేస్తానని మెయిల్‌లో ఆగంతకుడు పేర్కొన్నాడు. దీన్నిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సింధార్‌ రాజపుత్‌ అనే వ్యక్తి పేరిట మెయిల్‌ వచ్చినట్లు గుర్తించామని, తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.

త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెదిరింపు మెయిల్‌ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం నివాసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశామని చెప్పారు.

 

 

Exit mobile version
Skip to toolbar