Prime9

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. ముగ్గురు అధికారులపై వేటు

JK: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జమ్ముకాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. లష్కరే తోయిబాకు చెందిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ముష్కరులను, వారి సానుభూతి పరులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా ఇప్పటికే పలువురు ఉగ్రవాద సానుభూతి పరులను అధికారులు అరెస్ట్ చేశారు.

 

తాజాగా పాక్ కు గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని ఇవాళ పంజాబ్ లో అరెస్టు చేశారు. ఈ విషయం మరిచిపోకముందే పహల్గామ్ దాడి ఘటనలో ఉగ్రవాదలతో సంబంధాలు కలిగి ఉన్న ముగ్గురు అధికారులపై జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వేటు వేశారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించారు. మరోవైపు వీరు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్ సంస్థలకు గూఛచారిగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న 75 మంది అధికారులను నిఘా వర్గాలు గుర్తించారు.

Exit mobile version
Skip to toolbar