Site icon Prime9

ISRO GSLV-F15: చరిత్ర సృష్టించిన ఇస్రో.. 100వ ప్రయోగం విజయవంతం

ISRO Marks 100th Mission ISRO GSLV-F15 Successful Launch: ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6.23 నిమిషాలకు ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం జీఎస్ఎల్‌వీ-ఎఫ్15రాకెట్ ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రమోగం విజయవంతం కావడంతో షార్ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2,250 కేజీలు బరువు ఉన్న ఈ శాటిలైట్‌ను యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసింది. ఇది పదేళ్లపాటు భౌగోళిక, వైమానికి, సముద్ర నేవిగేషన్ సేవలు అందించనుంది.ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నారాయణన్.. తొలి ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మాట్లాడారు. షార్ నుంచి చేపట్టిన వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ కావడంతో సంతో షంగా ఉందన్నారు. ఇందుకోసం పనిచేసిన సైంటిస్టులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

రాబోయే రోజుల్లో రోదసిలో భారత్ అంతిరిక్ష కేంద్ర నిర్మాణం చేయనుందని ఇస్రో ఛైర్మన్ డా. నారాయణన్ ప్రకటించారు. బుధవారం ఉదయం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఏఫ్-15 శాటిలైట్‌ ప్రయోగం విజయవంతమైంది. కాగా, అంతకుముందు రోజు సూళ్లూరుపేటలోని చెంగాల పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో ఛైర్మన్ డా. నారాయణన్ దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహం (వీనస్ గ్రహం)పై పరిశోధనలు చేపడతామని తెలిపారు.

ఇదిలా ఉండగా, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 1979లో మొదటి ప్రయోగం నిర్వహించగా.. బుధవారం నాటి వందవ ప్రయోగంతో కొత్త మైలురాయిని చేరినట్లు తెలిపారు. జీఎస్ఎల్వీ ఎఫ్-15 శాటిలైట్ అంతరిక్షంలోకి పంపడం ద్వారా నావిగేషన్‌ను సులభంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 433 విదేశీ ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి ప్రయోగించినట్లు చెప్పారు. రూ.4 వేల కోట్లతో మూడో లాంచ్ ఫ్యాడ్ నిర్మిస్తున్నామన్నారు. గగన్‌యాన్ ప్రయోగానికి ఈ లాంచ్ ఫ్యాడే ఉపయోగించనున్నట్లు తెలిపారు.

షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుండి జీఎస్ఎల్వీ ఏఫ్-15 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో చరిత్ర సృష్టించింది. 2024లో కంటే ఈ ఏడాది రాకెట్ ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయని,ఈ ఏడాదిలో గగన్‌యాన్‌.. చంద్రయాన్-4, జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీతో పాటు మరో రెండు ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు చేపడతామని ఇస్రో ఛైర్మన్ డా. నారాయణన్ తెలిపారు. రాబోయే రోజుల్లో శుక్రగ్రహంపై పరిశోధనలు చేపడతామని, శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. 1979లో శ్రీహరికోట నుంచి ఎస్ఎల్వీ ఈ1 ద్వారా మొట్ట మొదటి రాకెట్ ప్రయోగం చేపట్టామని, ఇవాళ శ్రీహరికోట నుంచి వందో ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిందన్నారు. ఈ ప్రయోగంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని, దేశీయ నావిగేషన్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే ఐదు ఉపగ్రహాలను పంపామన్నారు. మరో మూడు, నాలుగు నావిగేషన్ ఉపగ్రహాలను పంపుతామని, ఈ ఏడాది మరో రెండు డాకింగ్ ఉపగ్రహాలలు, అతి త్వరలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడతామని ఇస్రో చైర్మన్ చెప్పారు.

శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంగా ఇవాళ ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌15 ప్రయోగంతో సెంచరీ పూర్తయింది. ఈ 46 ఏళ్లలో ఈ కేంద్రం నుంచి 4 ఎస్‌ఎల్‌వీ రాకెట్‌లు, 4 ఏఎస్‌ఎల్‌వీలు, 62 పీఎస్‌ఎల్‌వీలు 62, 16 జీఎస్‌ఎల్‌వీలు, ఎల్‌వీఎం3–7, ఎస్‌ఎస్‌ఎల్‌వీలు 3, స్క్రామ్‌జెట్‌ 1, ఆర్‌ఎల్‌వీ టీడీ 1, క్రూ ఎస్కేప్‌ సిస్టం 1 ప్రయోగించారు.

Exit mobile version