Site icon Prime9

IndiGo: ఫుల్ గా తప్పతాగి.. ఇండిగోలో మళ్లీ అదే ఘటన

IndiGo

IndiGo

IndiGo: ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్‌ ఇండియాలో మూత్రవిసర్జన ఘటన ఎంతో సంచలనం రేపిందో అందరికీ తెలుసు. ఆ ఘటన మరువకముందే మరో సంస్థ కు చెందిన విమానంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాజాగా ఇండిగో (IndiGo)కు చెందిన ఓ విమానంలో ఈ సంఘటన జరిగింది. మార్చి 26 వ తేదీ గౌహతి నుంచి దిల్లీ వెళుతోంది. అందులో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఫుల్ గా తాగి తన సీటు పక్కనే వాంతులు చేసుకున్నాడు. అంతే కాకుండా టాయిలెట్‌ వద్ద మలవిసర్జన చేశాడు. దీంతో విమానంలోని సిబ్బంది, తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోను అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ న్యాయవాది ట్విటర్‌లో పోస్టు చేయడంతో విషయం బయటపడింది.

మహిళా శక్తికి సెల్యూట్( IndiGo)

ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత బాధ్యతగా వ్యవహరించిన విమాన సిబ్బందిని సదర ప్యాసింజెర్ ప్రశంసించారు. ఓ వ్యక్తి తప్పతాగి సీట్ల పక్కనే వాంతి చేసుకున్నాడు. టాయిలెట్‌ వద్ద మలవిసర్జన చేశాడు. క్రూ సిబ్బంది లోని శ్వేత అనే యువతి ఆ చోటును క్లీన్ చేసింది. అమ్మాయిలందరూ పరిస్థితిని చక్కదిద్దారు. మహిళా శక్తికి నా సెల్యూట్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ చూసిన యూజర్లు ఇండిగో లో జరిగిన సంఘటనపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

పదే పదే ఇలాంటి ఘటనలు

ఇటీవల విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మద్యం మత్తులో కొందరు ప్రయాణికులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తుండటం తోటి ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా మారుతోంది. ఎయిరిండియా విమానంలోనూ ఇదే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. తప్పతాగి ఓ ప్రయాణికుడు ఓ మహిళపై మూత్ర విసర్జన చేయగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఈ ఘటన జరిగిన మరో 10 రోజులకే తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మరో వ్యక్తి మూత్ర విసర్జనకు పాల్పడిన ఘటన కూడా వివాదాస్పదమైంది. విమానాల్లో పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలను అరికట్టాలంటే విమానాల్లో మద్యం నిషేధించాలని ప్రయాణికులు అంటున్నారు.

 

 

Exit mobile version