Site icon Prime9

Indian Navy: ఇండియన్ నేవీలోకి మరో సరికొత్త అస్త్రం.. పరీక్షలు విజయవంతం

Indian Navy

Indian Navy

Indian Navy: ఇండియన్ నేవీలోకి మరో సరికొత్త అస్త్రం చేరబోతోంది. పూర్తిగా దేశీయ టెక్నాలజీ ని ఉపయోగించి అభివృద్ధి చేసిన భారీ ‘టార్పిడో’ ను భారత నౌకాదళం మంగళవారం పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పిడో దిగ్విజయంగా ఛేదించింది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ దళం వీడియో ద్వారా ట్విటర్ లో పంచుకుంది. ‘ నీటి అడుగున ఉండే లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే ఆయుధాల కోసం భారత నౌకాదళం, డీఆర్డీవో చేస్తున్న అన్వేషణలో ఇదో కీలక మైలురాయి. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన భారీ బరువు ఉన్న టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశాం. ఆత్మనిర్భరతలో భాగంగా భవిష్యత్ లో మా పోరాట సంసిద్ధతకు ఈ ఆయుధం నిదర్శనం’ అని నేవీ ట్వీట్ చేసింది.

 

 

ముప్పు పెరుగుతున్న వేళ..(Indian Navy)

హిందూ మహా సముద్రంలో చైనా నుంచి ముప్పు పెరుగుతున్న వేళ.. నౌకాదళం ఈ ప్రయోగం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ టార్పిడో పేరును నేవీ ప్రకటించలేదు. ఇప్పటికే భారత నౌకాదళానికి ఇప్పటికే ‘వరుణాస్త్ర’ పేరు గల అధిక బరువు ఉండే టార్పిడో ఉంది. ఇది ఎవరి సాయం లేకుండా.. నీటి అడుగు నుంచి ప్రయోగించే క్షిపణి. 30 కిలో మీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి శత్రునౌకల పై ఈ టార్పిడోను ప్రయోగిస్తారు. వరుణాస్త్ర ను విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ డెవలప్ చేసింది.

 

Exit mobile version