Prime9

India-Pakistan : పాకిస్థాన్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణసాయం.. ఖండించిన భారత్‌

Asian Development Bank loan to Pakistan : పాకిస్థాన్ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేయడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్ సైనిక వ్యయం కోసం నిధులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెల 3వ తేదీన ప్యాకేజీకి ఆమోదం లభించింది.

 

పునరాలోచించాలి..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో గట్టిగా బదులు తీర్చుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నది. ఈ నేపథ్యంలో పాక్‌కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 1 బిలియన్‌ డాలర్ల నిధులు (దాదాపు రూ.8,540 కోట్లు) మంజూరయ్యాయి. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కింద మొత్తాన్ని ఇవ్వడానికి ఐఎంఎఫ్‌ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌కు నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని, విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌కు నిధులు సమకూర్చడంపై పునరాలోచించాలని భారత ప్రభుత్వం కోరింది

Exit mobile version
Skip to toolbar