Huge Encounter breaks out between terrorists: జమ్ముకశ్మీర్ కాల్పులతో మరోసారి దద్దరిల్లిపోయింది. జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గాంలో భద్రతాదళాగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాగాలు అదుపులోకి తీసుకున్నాయి.
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తెలుసుకున్నా భద్రతదళాగాలు కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. అయితే ఆ ప్రాంతానికి వెళ్లిన భద్రతదళాగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతదళాగాలు ఎదురుకాల్పులు జరిపి ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు.
కాగా, ఆ ప్రాంతంలో ఇంకా ముష్కర ముఠా ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‌పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు నేడు అసెంబ్లీ ఎన్నికలు తర్వాత జమ్ముకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లపై హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ, పారా మిలటరీ బలగాలు, అధికారులు హాజరుకానున్నారు.