Site icon Prime9

Lieutenant Governor Manoj Sinha: ఇకపై జమ్మూకశ్మీర్ లో డిపార్టుమెంటు స్టోర్స్ లో బీరు అమ్మాకాలు.. మండిపడుతున్న భాజపా శ్రేణులు

Henceforth beer sales in departmental stores in Jammu and Kashmir

Henceforth beer sales in departmental stores in Jammu and Kashmir

Srinagar: సూపర్ మార్కెట్లకు, వైన్ షాపులకు తేడా లేకుండా చేశారు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్మూ-కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. అయితే దీనిని భాజపా శ్రేణులు ఖండిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్లితే, బీర్, తదితర రెడీ టు డ్రింక్ పానీయాల అమ్మకాలను ఇకపై డిపార్టెమెంటల్ స్టోర్స్ కూడా విక్రయాలు చేసుకోవచ్చని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. లెప్టినెంట్ గవర్నర్ సలహాదారు రాజీవ్ రాయ్ భట్నాగర్, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ కుమార్ మెహతా సమక్షంలో గవర్నర్ మనోజ్ సిన్హా ఈ మేరకు నిర్ణయించారు. 1984, ఎక్సైయిజ్ పాలసీను 2023-24కు సవరిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

దీనిపై మాజీ ఉప ముఖ్యమంత్రి, భాజపా నేత కవీందర్ గుప్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మతపరమైన మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. జమ్మూ అంటే దేవాలయాల నగరమని, అలాంటి ప్రదేశాల్లో విచ్చలవిడిగా డిపార్టుమెంటల్ స్టోర్స్ బీర్, ఇతర ఆల్కాహాల్ బెవరేజెస్ అమ్మకాలకు తాము వ్యతిరేకమని చెప్పారు.

ఇది కూడా చదవండి: దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం.. కర్ణాటక సర్కార్ పై మండిపడ్డ రాహుల్ గాంధీ

Exit mobile version