Air India pilot: దుబాయ్ నుండి ఢిల్లీకి నడుపుతున్న ఎయిర్ ఇండియా విమానం యొక్క పైలట్ కాక్‌పిట్‌లోకి మహిళా స్నేహితురాలిని అనుమతించడంపై డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) దర్యాప్తు ప్రారంభించింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ఈ ఘటన ఫిబ్రవరి 27 న జరిగిందని డీజీసీఏ తెలిపింది.
సీరియస్ గా తీసుకున్నాము..(Air India pilot)
ఈ సంఘటనను మేము తీవ్రంగా పరిగణించాము. ఎయిర్ ఇండియాలో పరిశోధనలు జరుగుతున్నాయి. మేము ఈ విషయాన్ని డిజిసిఎకు నివేదించాము. వారి పరిశోధనలకు సహకరిస్తున్నాము. మా ప్రయాణీకుల భద్రత మరియు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలలో మేము రాజీపడం. అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా తెలిపింది.దుబాయ్-ఢిల్లీ విమానంలోని క్యాబిన్ క్రూ సభ్యుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై డీజీసీఏ విచారణ జరుపుతోందని అధికారి శుక్రవారం తెలిపారు. దర్యాప్తు బృందం సాంకేతిక మరియు భద్రత కోణం నుండి సంబంధిత వాస్తవాలను పరిశీలిస్తుందని అధికారి తెలిపారు.
కాక్‌పిట్ లో ఆహారం, డ్రింక్స్, దిండ్లు..
కెప్టెన్ తన స్నేహితుడిరాలిని లోపలికి ఆహ్వానించే ముందు కాక్‌పిట్ స్వాగతించేలా కనిపించాలని సిబ్బందిని కోరాడు. ఆమెకు బిజినెస్ క్లాస్‌లో వడ్డించే ఆహారాన్ని అందించమని తెలిపాడు.తన మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌కు తీసుకురావాలని కెప్టెన్ చెప్పాడు.ఆమె సౌకర్యం కోసం కొన్ని దిండ్లు తీసుకురావాలని ఆదేశించాడు.ఆమె మొదటి అబ్జర్వర్ సీటులో కూర్చుంది.అలాగే, ఆమెకు డ్రింక్స్ మరియు స్నాక్స్ కాక్‌పిట్‌లో ఇమ్మన్నాడు. నేను అతనితో, కెప్టెన్, కాక్‌పిట్‌లో మద్యం సేవించడం నాకు సౌకర్యంగా లేదు అని చెప్పాను. ఇది అతనిని చాలా బాధపెట్టినట్లు అనిపిస్తుంది.ఆ క్షణం నుండి అతని వైఖరి మొత్తం మారిపోయింది. అతను చాలామొరటుగా ఉన్నాడు.అక్కడ నుండి అతని కోసం ప్రత్యేకంగా పనిచేసే సేవకుడిలా నన్ను చూడటం ప్రారంభించాడు క్రూ సభ్యుడు ఫిర్యాదు చేసాడు.సాధారణంగా అనధికార వ్యక్తులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడరు మరియు అలాంటి ప్రవేశం భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుంది.