Site icon Prime9

Atishi : గుజరాత్‌, గోవాలో ఒంటరిగానే పోటీ : ఆతిశీ

Atishi

Atishi : గోవా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ తెలిపారు. కాంగ్రెస్‌‌పాటు ఎవరితోనూ పొత్తులపై ఇంకా చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ఇవాళ గోవాలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కూటమిగా పోటీ చేయడంపై ఇప్పటి వరకు చర్చించలేని స్పష్టం చేశారు. 2022లో గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్‌ పార్టీ 11 సీట్లు గెలుచుకున్నా 8 మంది బీజేపీలో చేరారని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి ముగ్గురు సభ్యులు ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇద్దరు ఉన్నారన్నారు. ఆప్‌ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు నెలలు కూడా నిలవలేరని ప్రచారం చేశారని, వాళ్లు ఇప్పటికీ ఆప్‌ వెన్నంటే ఉన్నారన్నారు. రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదని, అందుకే ఇప్పటికీ వారు ఆప్‌ పార్టీతోనే ఉన్నారని తెలిపారు.

భావసారూప్యత ఎక్కడిది?
భావసారూప్యత కలిగిన ఉన్న పార్టీలతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆసక్తి చూపడంలేదా? అని విలేకర్లు ప్రశ్నించగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి 11 మంది గెలిస్తే, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఇంకా భావసారూప్యత ఎక్కడిది? బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నించిందన్నారు. ఎన్నికల్లో గెలిచి డబ్బు సంపాదించాలన్న లక్ష్యం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసే రాజకీయాలు అంటేనే తమకు ఆసక్తి అన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై స్పందించారు. ఆప్‌‌కి ఏం జరుగుతుందనేది కాదని, ప్రజలకు ఏమి జరుగుతుందనేదే చూడాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 250 మొహల్లా క్లీనిక్‌లను మూసివేస్తామని ఇప్పటికే ప్రకటించిందన్నారు. ఉచిత మందులను సైతం నిలిపేస్తామని చెబుతోందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడితే విద్యుత్‌ కోతలు మొదలవుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో తమ హయాంలో అందించిన నాణ్యమైన విద్య మళ్లీ దురావస్థకు చేరుతుందని కేజ్రీవాల్‌ హెచ్చరించారని పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar