Site icon Prime9

Farmers’ ‘Delhi Chalo’ March: ‘చలో ఢిల్లీ’ ర్యాలీలో హైటెన్షన్.. రైతులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం

Farmers’ ‘Delhi Chalo’ March at Shambhu Border, Police Deploy Tear Gas: ఢిల్లీ శంభు సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో ఢిల్లీ ర్యాలీలో భాగంగా ఢిల్లీ శంభు నుంచి ముందుకెళ్తున్న రైతులను పోలీసులను అడ్డుకున్నారు. ఈ మేరకు అన్నదాతలపై పోలీసులు మరోసారి తమ ప్రతాపం చూపించారు.

అనంతరం రైతులను చెదరగొట్టేందుకు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ ర్యాలీలో రైతులు లేరని పోలీసులు చెబుతున్నారు. తమకు చెప్పిన 101 మంది ఇతరులు ర్యాలీలో పాల్గొన్నారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. అందుకే అడ్డుకున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు.

కాగా, ఈ ఘటనలో దాదాపు 16 మంది రైతులు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా కొంతమంది రైతులు మీడియాతో మాట్లాడారు. గాయపడిన రైతుల్లో ఒకరికి వినికిడి శక్తి కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు, రైతులపై హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన విషయం తెలిసిందే.

మరోవైపు, తమ డిమాండ్లపై చర్చలు జరిపేందుకు ఇప్పటివరకు కేంద్రం నుంచి ఆహ్వానం రాలేదని రైతులు వెల్లడించారు. అయితే తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేదన్నారు. అందుకే చలో ఢిల్లీని ఆదివారం తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు రైతులు చెప్పారు. కానీ మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది.

Exit mobile version