Site icon Prime9

Faridabad: భార్య భరణం కోసం.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త

Faridabad

Faridabad

Faridabad: హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ‘నా మూత్ర పిండం అమ్మకానికి సిద్ధంగా ఉంది’. ‘మార్చి 21న నా ఆత్మాహుతి కార్యక్రమం’ అని రాసి భార్యతో కలిసి, విడివిడిగా ఉన్న ఫొటోలతో ఓ బ్యానర్‌ తీసుకుని తిరుగుతున్నాడో వ్యక్తి. ఆయన అలా ఎందుకు చేస్తున్నాడనే అక్కడ ఉండే వారంతా ఆసక్తిగా చూడగా.. ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అయింది.

విడాకులు కావాలంటే 10 లక్షలు (Faridabad)

అసలు విషయానికొస్తే.. బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన సంజీవ్‌కు ఆరేళ్ల క్రితం పెళ్లి అయింది. కొన్నేళ్ల పాటు కాపురం సాఫీగానే సాగిన.. తర్వాత అతనికి కష్టాలు మొదలయ్యాయి. భార్య, బావమరిది, అత్తమామల నుంచి వేధింపులు రోజురోజుకు పెరిగి పోయాయి.

దీంతో అతను విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఇక్కడే అతని భార్య పేచీ పెట్టింది. విడాకులు కావాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని భార్య డిమాండ్‌ చేసింది.

ఆత్మాహతి కార్యక్రమం అంటూ బ్యానర్

దీంతో ఏం చేయాలో తెలియని సంజీవ్‌ సాయం చేయాల్సిందిగా పోలీసులు, అధికారులను అనేకమార్లు సంప్రదించిన తర్వాతే విసిగిపోయి ఇలా బ్యానర్‌తో తిరుగుతున్నట్టు సంజీవ్ చెప్పాడు. మార్చి 21 లోగా కిడ్నీ విక్రయిస్తే ఆ డబ్బులు తన భార్యకు ఇస్తానని చెబుతున్నాడు. ఒక వేళ విక్రయించలేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు.

ఈ మేరకు 21న పట్నాలో ఆత్మాహతి కార్యక్రమం ఉంటుందని తెలిపాడు. అయితే కొసమెరుపు ఏంటంటే ఆత్మాహుతి కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ల పేర్లను సైతం బ్యానర్‌పై ముద్రించాడు. రెండో వైపు.. భార్య, బావమరిది, ఇతర బంధువుల ఫొటోలను వేశాడు.

 

Exit mobile version