Site icon Prime9

Minister Jaishankar: ప్రజలకు చౌక ధరకు ఇంధన అందించడం నా బాధ్యత విదేశాంగ మంత్రి జైశంకర్

External Affairs Minister Jaishankar

Minister Jaishankar: ప్రజలు కొనగలిగే ధరలకు చమురును అందించడం భారత దేశ ప్రభుత్వం నైతిక కర్తవ్యమని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. ఆత్మరక్షణ ధోరణిలో పడిపోకుండా, రష్యా నుంచి చమురును కొంటున్నామని వివరించారు. మన దేశ విధానాన్ని ఇప్పుడు ఇతర దేశాలు కూడా ఆమోదిస్తున్నాయని చెప్పారు .. బ్యాంకాక్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురును కొనడానికి భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ఇప్పుడు ఆమోదిస్తున్నాయని చెప్పారు. దీనికి కారణం భారత్‌ తన నిర్ణయం పట్ల ఆత్మరక్షణ ధోరణిలో లేకపోవడమేనని తెలిపారు. తమ ప్రజల పట్ల తమకు గల బాధ్యతను ఇతర దేశాలు తెలుసుకునేలా భారత దేశం చేసిందని వివరించారు. నిజాయితీగా, అరమరికలు లేకుండా వ్యవహరిస్తే, అందరూ ఆమోదిస్తారని చెప్పారు.

మన నిర్ణయాలకు ఎల్లప్పుడూ ఆమోదం లభించకపోయినప్పటికీ, నిర్ణయం తీసుకుని, అమలు చేస్తే, మితిమీరిన తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేయకపోతే, మీ ప్రయోజనాలను సూటిగా వ్యక్తీకరిస్తే, ఆ నిర్ణయం వాస్తవికతతో కూడినదని ప్రపంచం కూడా అంగీకరిస్తుందనేది తన అభిప్రాయమన్నారు జైశంకర్‌.

Exit mobile version