Site icon Prime9

Karnataka Crime News: 5ఏళ్ల చిన్నారిపై అత్యాచారం… నిందితుడి ఎన్ కౌంటర్.. పోలీసులపై ప్రశంసలు కురిపితున్న నెటిజన్లు!

Five Year Old Girl Rapped Accused Encounter by Karnataka Police: కర్ణాటకలోని హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి ఆపై గొంతు నులిమి చంపేశాడు. కొప్పళకు చెందిన భార్యభర్తలు తమ 5 ఏళ్ల కూతురితో కలిసి హుబ్బళ్లిలో నివాసం ఉంటున్నారు. ఆ చిన్నారి తండ్రి పెయింటర్ గా పనిచేస్తుండగా పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అయితే ఆ చిన్నారి తల్లి ఇంట్లో పనులు చేస్తుండగా.. ఈ సమయంలో బీహార్‌కు చెందిన రితేశ్ ఆ పాపను ఎత్తుకెళ్లాడు.

 

కాగా, ఆ చిన్నారిని ఓ షెడ్డు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. తర్వాత చిన్నారి కోసం వెతగగా కనిపించలేదు. దీంతో సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ఓ యువకుడు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకునే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు చనిపోగా.. ఎస్ఐ, ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి.

 

అయితే, ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం, ఆపై హత్య చేసిన నిందితుడిని పీఎస్ఐ అన్పపూర్ణ ఎన్‌కౌంటర్ చేసింది. ఆమె ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నిందితుడు రితేశ్ కోసం వేట కొనసాగిస్తుండగా.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. లొంగిపోవాలని ఎంతచెప్పినప్పటికీ రితేశ్ పోలీసులపై రాళ్లు విసిరాడు. దీంతో ఆఫీసర్ అన్నపూర్ణ నిందితుడు రుతేశ్‌పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో రితేశ్ మరణించాడు. అయితే కాల్పులు జరపగా.. రెండు బుల్లెట్లు తగలడంతో నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఎన్‌కౌంటర్ చేసిన అన్నపూర్ణను నెటిజన్లు లేడీ సింగం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar