Site icon Prime9

Colombo Airport : కొలంబో విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్.. ఎందుకంటే?

Colombo Airport

Colombo Airport

Sri Lankan flight departing from Chennai to Colombo : చెన్నై నుంచి కొలంబోకు బయలుదేరిన శ్రీలంక విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు ఈమెయిల్‌ అందింది. వెంటనే చెన్నై విమానాశ్రయం అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో శ్రీలంకను అలర్టు చేశారు. కొలంబో చేరుకున్న విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. శనివారం ఉదయం 11.5 గంటలకు చెన్నై విమానాశ్రయం చీఫ్ సెక్యూరిటీ అధికారికి ఈమెయిల్‌ వచ్చింది. చెన్నై నుంచి కొలంబో వెళ్లే శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమనాశ్రయంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు ఈమెయిల్‌లో ఉంది. విమానంలో ఉన్న ఐదుగురు దక్షిణ భారతీయులైన పురుషులు లష్కరే కార్యకర్తలు ఉన్నారని, బాగా శిక్షణ పొందినవారు, ఎలాంటి అనుమానం లేదని ఈమెయిల్‌లో పేర్కొన్నారు.

 

 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. నిఘా వర్గాల సమాచారంగా భావించారు. శ్రీలంకన్‌ ఫ్లైట్ అప్పటికే చెన్నై నుంచి బయలు దేరగా, కొలంబో విమానాశ్రయానికి సమాచారం అందించి అలర్టు చేశారు. దీంతో అక్కడ దిగిన విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను గుర్తించ లేదని శ్రీలంక తెలిపింది. ఈ క్రమంలో బెదిరింపు ఈమెయిల్‌గా దీన్ని పరిగణించారు.

Exit mobile version
Skip to toolbar