ED Issued Notice to Priyanka Gandhi husband Robert Vadra on Money Laundering Case: కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.7.5కోట్ల విలువైన మనిలాండరింగ్ వ్యవహారంలో వాద్రాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న ఈడీ విచారణకు హాజరు కావాలంటూ వాద్రాకు నోటీసులు జారీ చేయగా, గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి వాద్రాకు నోటీసులు జారీ చేసింది. దీంతో మంగళవారం రాబర్ట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. గుర్గావ్ ల్యాండ్ స్కామ్, భూసేకరణ లావాదేవీల కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వాద్రా మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుట్రలో భాగంగా తనకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. తాను ప్రజాగొంతుక వినిపించినప్పుడల్లా బీజేపీ తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. తన వద్ద దాచడానికి ఏమీ లేదని, ఈడీ అధికారులు ఏది అడిగినా సమాధానం చెబుతానని స్పష్టం చేశారు.
హర్యానాలో భూ ఒప్పందంలో అక్రమాలు..
పియాంక గాంధీ భర్త వాద్రా హర్యానాలో జరిగిన ఓ భూ ఒప్పందంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ల్యాండ్ స్కామ్, మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు. కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఈ నెల 8న నోటీసులు జారీ చేశార. కానీ, అప్పుడు గైర్హాజరు అయ్యారు. దీంతో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా విచారణకు హాజరయ్యారు.
గతంలో మరో మనీలాండరింగ్ కేసు..
గతంలో మరో మనీలాండరింగ్ కేసులో వాద్రాను ఈడీ ప్రశ్నించింది. తాజా కేసు ఫిబ్రవరి 2008లో వాద్రాకు చెందిన స్కెలైట్ ఆసుపత్రి కోసం రూ.7 కోట్లకు భూమి కొనుగోలుకు సంబంధించినది. సాధారణంగా నెలలు పట్టే మ్యుటేషన్ ప్రక్రియ ఒక్క రోజుల్లో పూర్తవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. కొంతకాలం తర్వాత భూమిలో హౌసింగ్ సొసైటీని అభివృద్ధి చేయడానికి అనుమతి లభించింది. ఆ సమయంలో ప్లాట్ల ధర భారీగా పెరిగింది. అదే ఏడాది జూన్‌లో సదరు భూమిని డీఎల్‌ఎఫ్‌కి రూ. 58 కోట్లకు విక్రయించారు. ఈ వ్యవహారంపై ఈడీ సీరియస్‌గా దృష్టి పెట్టింది.