Site icon Prime9

Earthquake in Delhi: తెల్లవారుజామున ఢిల్లీలో భూప్రకంపనలు.. ప్రజల్లో భయాందోళనలు!

Earthquake Early morning In Delhi: ఢిల్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీలో సంభవించిన భూకంప్రనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎవరూ కూడా భయాందోళనకు గురికాకూడదని చెప్పారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వివరించారు. ఈ భూకంప్రనటలు మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ సహా ఎన్‌సీఆర్, బీహార్, యూపీ వంటి ప్రాంతాల్లోనూ కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉదయం 5.36 గంటలకు ఓ ఇంటి వద్ద సీసీ కెమెరాలో భూప్రకంపనల దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ మేరకు పలు సెకన్లపాటు భూమి కంపిస్తూ ఉండగా.. అన్ని ఊగుతున్నట్లు అందులో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. బీహార్‌లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. బీహార్‌లోని శివాన్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar