Mumbai Dabbawalas: మే 6న బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక వేడుక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందని ముంబైకి చెందిన ప్రముఖ డబ్బావాలాలు తెలిపారు. దీనికోసం వారు బహుమతులు కొనుగోలు చేసారు. డబ్బావాలాలు రాజు కోసం పుణేరి పగడి మరియు వార్కారీ కమ్యూనిటీకి చెందిన ఒక శాలువను కొనుగోలు చేశారు.చక్రవర్తి పట్టాభిషేక వేడుకకు హాజరు కావాల్సిందిగా డబ్బావాలాలకు బ్రిటీష్ రాయబార కార్యాలయం ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.
చార్లెస్ పెళ్లికి హాజరయిన డబ్బావాలాలు..( Mumbai Dabbawalas)
ఈ సందర్బంగా ముంబై డబ్బావాలాల ప్రతినిధి విష్ణు కల్డోక్ మాట్లాడుతూ ముంబై డబ్బావాలాలకు బ్రిటిష్ రాయల్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అతని పెళ్లికి ఇద్దరు డబ్బావాలాలను ఆహ్వానించారు. ఇది మాకు గౌరవం. అతను రాజు కాబోతున్నాడు. కాబట్టి, మేము కింగ్ చార్లెస్‌కి పుణేరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు2003లో, చార్లెస్ III తన నగర పర్యటన సందర్భంగా ముంబైలోని చర్చ్‌గేట్ స్టేషన్‌లో డబ్బావాలాలను కలిశారు. ఇద్దరు డబ్బావాలాలు చార్లెస్ మరియు కెమిల్లా పార్కర్-బౌల్స్ యొక్క రాజ వివాహానికి హాజరయ్యారు.
క్వీన్ ఎలిజబెత్ II 2022లో మరణించినప్పుడు, ముంబై డబ్బావాలా అసోసియేషన్ తమ విచారాన్ని వ్యక్తం చేసింది. ప్రిన్స్ చార్లెస్ భారతదేశాన్ని సందర్శించినప్పటి నుండి ముంబై డబ్బావాలా అసోసియేషన్ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీతో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది.