Site icon Prime9

DMK MP Kanimozhi: కేంద్ర హోం మంత్రికి డిఎంకే ఎంపీ కృతజ్ఞతలు

DMK MP thanked Amit Shah

DMK MP thanked Amit Shah

Chennai: సమాచారం మేరకు కనిమొళి తల్లి రాజాత్తి అనారోగ్యంతో చికిత్స నిమిత్తం జర్మనీలోని ఓ వైద్యశాలలో చేరారు. విషయాన్ని తెలుసుకొన్న అమిత్ షా ఎంపీ కనిమొళితోపాటు ఆమె తల్లి విదేశాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేయాలంటూ భారత రాయభార కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు. జర్మనీలోని భారత విదేశాంగకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన అమిత్ షా చికిత్సకు ఎంపీ కుటుంబసభ్యులకు సహకరించాలని పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో చికిత్స అనంతరం దేశానికి వచ్చిన వచ్చిన ఎంపీ కనిమొళితో పాటు ఆమె తల్లి, ఇరువురు అమిత్ షా కు ఫోన్ చేసి సహకారానికి కృతజ్ఞతలు తెలియచేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ కుటుంబ సభ్యులకు అమిత్ షా ఇచ్చిన ప్రత్యేకత పై డిఎంకే పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Exit mobile version