Site icon Prime9

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో డైరెక్టర్ కు ఊరట

Delhi liquor Scam

Delhi liquor Scam

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అరబిందో డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డికి ఊరట లభించింది. ఆయన పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరైంది. ప్రజెంట్ శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తన భార్య అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన చేసిన విజ్ఞప్తి మేరకు ఢిల్లీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం కింద ఆయనను ఈడీ అరెస్టు చేసింది.

భార్య అనారోగ్యం దృష్ట్యా..(Delhi liquor Scam)

శరత్‌ చంద్రారెడ్డికి ఢిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తిహార్ జైలులో ఉన్న శరత్‌చంద్రారెడ్డి.. తన భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను చూసుకోవాలని.. అందుకు 6 వారాల పాటు బెయిల్‌ మంజూరు కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. ఆయనకు పలు షరతులు విధించింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. భార్య చికిత్స కోసం మినహా హైదరాబాద్‌ దాటి వెళ్లకూడదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. మొబైల్‌ ఫోన్‌ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలని.. అందులో లొకేషన్‌ ఆన్‌లో పెట్టాలని పేర్కొంది.

 

సాక్షులను బెదిరించడం, ఆధారాలను చెరిపివేయడం లాంటివి చేయరాదని స్పష్టం చేసింది. ఎలాంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడొద్దని తెలిపింది. బెయిల్‌ గడువు ముగిసిన చివరి రోజు సాయంత్రం లోపు తిహార్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎదుట సరెండర్‌ కావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతకు ముందు తన నాయనమ్మ అంత్యక్రియల నిమిత్తం బెయిల్‌ కోరుతూ శరత్‌ చంద్రారెడ్డి జనవరి ఆఖరి వారంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక న్యాయస్థానం అప్పుడు ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా శరత్‌చంద్రారెడ్డికి పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

 

Exit mobile version