Site icon Prime9

Delhi Exit Polls 2025: ఢిల్లీ పీఠం బీజేపీదే.. 27 ఏళ్ల తర్వాత కమల వికాసం..!

Delhi Exit Polls 2025

Delhi Exit Polls 2025: రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అకోలా, సీలంపూర్‌, జంగ్‌పూర్‌, నియోజకవర్గాలు మినహా మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో ఆప్‌, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్‌ ఉంది. గెలుపుపై అటు రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈసారి ఢిల్లీలో అంచనాలను మించి పోలింగ్‌ శాతం నమోదైంది.

2020 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్‌ నమోదు కాగా, 2025లో సాయంత్రం 5 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైంది. దీన్ని గత ఎన్నికలతో పోలిస్తే 13 శాతం పోలింగ్‌ పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్‌ రావడం ప్రారంభమయ్యాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నేషనల్ ఛానెల్స్‌ ఎగ్జిట్ పోల్స్‌ విడుదల చేశాయి. 2020 ఎన్నికలతో పోలిస్తే 13శాతం ఓటింగ్ పెరగిందని పేర్కొంటున్నాయి. ఇది గెలుపోటములపై ప్రభావం చూపనుందని చెబుతున్నాయి.. ఈ సారి బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ ఉందని కొన్ని ఛానెళ్లు అంచనా వేస్తున్నాయి. కొన్నేమో బీజేపీకి అనుకూలంగా..మరికొన్నేమో ఆప్ గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ 

కేకే సర్వే> ఆప్ 39, బీజేపీ 22, కాంగ్రెస్ 9

చాణక్య స్ట్రాటజీస్> బీజేపీ 39-44 స్థానాలు, ఆప్‌ 25-28, కాంగ్రెస్ 2-3

పీపుల్స్‌ పల్స్‌> ఆప్‌ 10-19, బీజేపీ 51-60

టైమ్స్‌నౌ> ఆప్ 22-31, బీజేపీ 39-45, కాంగ్రెస్‌ 0-2

పీపుల్స్ ఇన్‌సైట్> ఆప్‌ 25-29, బీజేపీ 40-44, కాంగ్రెస్0-1

జేవీసీ ఎగ్జిట్‌పోల్> బీజేపీ 39-45 స్థానాలు, ఆప్ 22-31, కాంగ్రెస్ 0-2

మ్యాట్రిజ్‌>ఆప్‌ 32-37, బీజేపీ 35-40, కాంగ్రెస్‌ 0-1

ఇప్పటి వరకు విడుదలైన ఢిల్లీ ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం.. బీజేపీకే స్పష్టమైన ఆధిక్యం కన్పిస్తోంది. 25 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. పెరిగిన ఓట్ల శాతం బీజేపీకి అనుకూలంగా ఉందనే భావన కన్పిస్తోంది. ఢిల్లీ మొత్తం 70 స్థానాలు కాగా మెజారిటీ రావంటే 36 స్థానాల్లో విజయం సాధించాలి.

Exit mobile version
Skip to toolbar