Gujarat couple: గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఒక వ్యక్తి మరియు అతని భార్య తమ తలలను ఇంట్లో సృష్టించిన గిలెటిన్ లాంటి పరికరాన్ని ఉపయోగించి నరుక్కుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. హేముభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35) వింఛియా గ్రామంలోని తమ పొలంలో ఉన్న గుడిసెలో బ్లేడ్ లాంటి పరికరంతో తలలు నరుక్కున్నారు.
ఏడాదికాలంగా ప్రార్దనలు..(Gujarat couple)
దంపతులు మొదట తమ తలలను తాడుతో గిలెటిన్ లాంటి యంత్రానికి కట్టి ఉంచారు. వారు తాడును విడిచిపెట్టిన వెంటనే, ఒక ఇనుప బ్లేడ్ వారిపై పడింది, వారి తలలు వేరు చేయబడ్డాయి. అవి అగ్నిగుండంలో పడ్డాయని స్దానిక ఇనస్పెక్టర్ జడేజా చెప్పారు. సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంగా వీరిద్దరూ ప్రతిరోజూ గుడిసెలో ప్రార్థనలు చేస్తున్నారని దంపతుల కుటుంబ సభ్యులు తెలిపారు.
సూసైడ్ నోట్ లో ఏముందంటే..
దంపతులకు ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మరియు ఇతర బంధువులు సమీపంలో నివసిస్తున్నారు, ఆదివారం ఉదయం సంఘటన గురించి తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం అందించారని జడేజా తెలిపారు. దంపతుల వద్ద లభించిన సూసైడ్ నోట్ లో తమ తల్లిదండ్రులు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులను కోరినట్లు ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు అధికారి తెలిపారు.