Site icon Prime9

Mallikarjun Kharge: దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై కుట్రలు.. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై ఖర్గే ఆరోపణలు!

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge Comments on BJP and RSS: బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ భావజాలానికి వ్యతిరేకం కంటూ విమర్శించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

 

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భావజాలానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఏ మాత్రం పాలు పంచుకోని వాళ్లు ఇప్పుడు పటేల్‌ వారసులం అంటూ ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు కలిసి జాతీయ నేతలపై కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. దేశంలో మతపరమైన విభజనలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇండియాలోని ప్రాథమిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.

 

కాంగ్రెస్‌ 140 ఏళ్లుగా దేశసేవలో నిమగ్నమై ఉందని చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో పోరాడిందని గుర్తుచేశారు. అలాంటి పార్టీకి ప్రస్తుతం దేశంలో వ్యతిరేక పరిస్థితులను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. స్వతంత్ర దేశం కోసం ఏమి సాధించని వారే ఇదంతా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పటేల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ మధ్య మంచి అనుబంధం ఉండేదని, నేతలిద్దరూ దేశం కోసం కలిసికట్టుగా పనిచేశారన్నారు. అలాంటిది ఆ నాయకులు ఒకరితో మరొకరు వ్యతిరేకంగా ఉండేవారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

నెహ్రూ-పటేల్‌ మధ్య నిత్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవన్నారు. అన్ని విషయాలపై నెహ్రూ పటేల్ సలహాలు తీసుకునేవారని గుర్తుచేశారు. పటేల్‌ అంటే నెహ్రూకు మంచి గౌరవం అన్నారు. ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే స్వయంగా నెహ్రూనే సర్దార్ వల్లభాయి పటేల్ ఇంటికి వెళ్లేవారని గుర్తుచేశారు. పటేల్‌ సౌలభ్యాన్ని దృష్టి ఉంచుకుని సీడబ్ల్యూసీ సమావేశాలు అతడి ఇంట్లోనే నిర్వహించేవారని తెలిపారు. అలాంటి గొప్ప నాయకులపై బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ రెండు కలిసి కుట్రచేస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.

Exit mobile version
Skip to toolbar