Site icon Prime9

Kharge : నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీది అవకాశవాద పొత్తు : ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Kharge

Kharge

Kharge : బీహార్‌లో జేడీయూ పార్టీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అది అవకాశవాద కూటమి అని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పార్టీలు మారుతుంటారని ఆరోపించారు. బిహార్‌లోని బక్సర్‌లో నిర్వహించిన పార్టీ సభలో పాల్గొని మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని ప్రజలను కోరారు.

 

బిహార్‌లో నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీది అవకాశవాద పొత్తు అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది ఏమాత్రం మేలు చేకూర్చదన్నారు. సీఎం పదవి కోసం నితీశ్ కుమార్ పార్టీలు మారుతాడని ఆరోపించారు. మరోవైపు ప్రధాని మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారని మండిపడ్డారు. బిహార్‌కు రూ.1.25లక్షల కోట్ల ప్రకటించిన ప్యాకేజీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రజలు నిలదీయాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాగఠ్‌బంధన్’‌కు ఓటేసి, ఎన్డీయే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

 

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌పై ఈడీ ఛార్జిషీటు నమోదు చేయడాన్ని మల్లికార్జున ఖర్గే ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకునేందుకే ఇలా చేశారని ఆరోపించారు. తమ నేతలు భయపడరన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. పేదలు, మహళలు, బలహీనవర్గాలకు బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు వ్యతిరేకమని విమర్శించారు. కులాలు, మతాల ఆధారంగా సమాజాన్ని విభజించాలని చూస్తాయని, వక్ఫ్ సవరణ చట్టం దీనికి ఒక ఉదాహరణ అని చెప్పారు.

 

 

Exit mobile version
Skip to toolbar