Site icon Prime9

Bus Catches Fire : మహారాష్ట్రలో ఘోర విషాద ఘటన.. బస్సులో 25 మంది సజీవ దహనం.. కారణం ఏంటంటే ?

bus-catches-fire at maharashtra buldana and 25 members died

bus-catches-fire at maharashtra buldana and 25 members died

Bus Catches Fire : మహారాష్ట్రలో ఘోర రోడ్డు విషాద ఘటన చోటు చేసుకుంది. బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తోన్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనం కాగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా మారింది. బస్సు యావత్‌మాల్‌ నుంచి పూణే వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సుమారుగా తెల్లవారు జామున రెండుగంటలకి ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులున్నారు. మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడగా.. తేవేర గాయాలైన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version