Site icon Prime9

Budget 2025: రైతులకు తీపి కబురు చెప్పిన నిర్మలమ్మ.. ఆ రుణాలు 5 లక్షలకు పెంపు..!

Budget 2025

Budget 2025

Budget 2025: ఈసారి బడ్జెట్‌లో రైతులకు తీపి కబురు అందింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఎదురుచూస్తున్న రైతులకు ఈసారి శుభవార్త అందింది. ఈసారి ప్రభుత్వం రైతులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కిసాన్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది.

అందరి దృష్టి ఈ ఏడాది బడ్జెట్‌పైనే ఉంది. బడ్జెట్‌లో ఏ వర్గానికి ఎలాంటి కేటాయింపులు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈసారి రైతులకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఈసారి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు రుణ పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి పెంచామని, ఈ పరిమితిని 5 లక్షలకు పెంచుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం తెలిపారు.

ఈ క్రెడిట్ కార్డు పరిమితిని సవరించడం ద్వారా రైతుల అవసరాలను తీర్చవచ్చు. ఈ విధానాన్ని తీసుకురావడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వవచ్చు. అందువల్ల, రైతులకు ఆర్థిక మద్దతును పెంచడానికి ఇది ఒక ప్రధాన చర్యగా భావిస్తున్నారు. ఈ విధంగా, రైతు రుణాన్ని సకాలంలో చెల్లిస్తే రైతుకు అదనంగా 3శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.

Kissan Credit Card Benefits
కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ రైతులకు వారి వ్యవసాయ అవసరాల కోసం సకాలంలో రుణాలను అందిస్తుంది. వ్యవసాయ కార్యకలాపాల కోసం రైతులకు సులభమైన, సరసమైన రుణాన్ని అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పంటల సాగు, విత్తనాలు, ఎరువులు వంటి ఇన్‌పుట్‌ల కొనుగోలు, పంట అనంతర కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చులకు సహాయం చేస్తుంది.

ముఖ్యంగా ఈసారి రుణ పరిమితిని పెంచి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. దీన్ని బట్టి ఈసారి బడ్జెట్ రైతుల్లో ఆనందాన్ని నింపిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రుణాలు రైతుల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి. పంట, భూమి పరిమాణం, రైతుల కార్యకలాపాలను బట్టి మొత్తం మారుతుంది.

ఈ లోన్ వడ్డీ రేట్లు 7శాతం నుంచి 9శాతం వరకు ఉంటాయి. రైతులు సకాలంలో తిరిగి చెల్లింపులు చేస్తే ప్రభుత్వం రాయితీలను కూడా ఇస్తుంది. రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాల స్థాయి ఆధారంగా రుణ పరిమితులను పొందచ్చు. రైతుల రీపేమెంట్ హిస్టీరీ, అవసరాల ఆధారంగా ప్రతి సంవత్సరం దీనిని పునరుద్ధరించవచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు విస్తృతమైన వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, పంట అనంతర ఖర్చులు మరియు నిల్వ, పశువుల పెంపకం మినహా ఇతర కార్యకలాపాల కోసం రుణాలు పొందవచ్చు.

రైతులు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా రుణాలు పొందవచ్చు. ఈ విధంగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుండి పొందచ్చు. సాధారణ రుణాలతో పోలిస్తే రైతులకు తక్కువ వడ్డీకే ఈ రుణాలు లభిస్తాయి.

Exit mobile version
Skip to toolbar