Site icon Prime9

BS Yediyurappa: యడ్యూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

BS Yediyurappa

BS Yediyurappa

BS Yediyurappa: భాజపా సీనియర్‌ నేత , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బి.ఎస్‌. యడ్యూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అయోమయం నెలకొంది.

కాసేపు గందరగోళం తర్వాత పైలట్ క్షేమంగా హెలికాప్టర్ ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అయితే యడ్యూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్‌పై ప్లాస్టిక్‌ పేరుకుపోయింది.

దీంతో చివరి నిమిషంలో పైలట్‌ ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రమాదం తప్పింది.

 

హెలిప్యాడ్‌పై చెత్తాచెదారం(BS Yediyurappa)

ఈ ఉదయం యడియూరప్ప , మరికొంతమంది భాజపా నేతలతో కలిసి కలబుర్గి వెళ్లారు.

అయితే జెవార్గి ప్రాంతంలో వీరి హెలికాప్టర్‌ను దించేందుకు స్థానిక అధికారులు హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే హెలిప్యాడ్‌పై చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ షీట్లు పేరుకు పోయాయి.

హెలికాప్టర్‌ ల్యాండ్ అయ్యేందుకు కిందకు రాగానే అవన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారాయి.

దీంతో పైలట్‌ చివరి నిమిషంలో ల్యాండింగ్‌ను రద్దు చేసుకుని కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టారు.

ఆ తర్వాత స్థానిక యంత్రాంగం హెలిప్యాడ్‌ ను శుభ్రం చేసి ల్యాండింగ్‌కు వీలు కల్పించారు. అప్పటి దాకా హెలికాప్టర్‌ అక్కడే గాల్లో చక్కర్లు కొట్టింది.

కొంతసేపటి తర్వాత అదే హెలిప్యాడ్‌పై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

 

 

ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

కాగా, కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు సీనియర్ అయిన యడ్యూరప్ప(BS Yediyurappa)ను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటోంది.

యడ్యూరప్ప కలబుర్గి బీజేపీ జన సనకల్ప యాత్ర లో పాల్గొనేందుకు రాగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో తప్పడంతో బీజేపీ శ్రేణులు, యడ్యూరప్ప అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Exit mobile version